తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా రూ. 15 వేల రైతు భరోసా కింద ప్రతీ రైతు ఖాతాలో జమ చేయాలని బీజేపీ గిరిజన మోర్చ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ ములుగు మండల అధ్యక్షుడు రాయంచు నాగరాజు, కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు బండి బాబుల ఆధ్వర్యంలో మేనిఫెస్టో హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ.. రైతులుకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చెల్లించాలని, కమిటీల పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. రైతు కూలాలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున వెంటనే పంపిణీ చేయాలన్నారు. రైతులకోసం తీసుకువచ్చిన బీమా పథకాలను వెంటనే అమలు చేయాలని, రూ.500ల బోనస్ చెల్లించాలన్నారు. లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జినుకల కృష్ణాకర్ రావు, మాజీ మండల అధ్యక్షుడు గాదం కుమార్, ప్రధాన కార్యదర్శి బైకాని మహేందర్, ఉపాధ్యక్షుడు పాపి రెడ్డి, కోశాధికారి సాగర్, కార్యదర్శి శ్రీహరి, రవీందర్ రావు, చిన్న కొండ రెడ్డి, లకావత్ రాజు, అప్పాని సురేష్, అజ్మీర కిషోర్ నాయక్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.







