పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎవరూ భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరంలేదని ఆయన భరోసా కల్పించారు. పట్టణంలోని కొలిపుర కాలనీకి చెందిన తోట లింగన్నకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన 60 వేల రూపాయల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మెన్ జహీర్ రంజాని, బండారి సతీష్, సోమ ప్రశాంత్, ఫైజుళ్ల, కిజార్ పాషా, కృష్ణారెడ్డి, రాంరెడ్డి, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 54








