ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా కీలక సూచన చేశారు. ప్రస్తుతం చలికాలం దృష్ట్యా అనారోగ్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జర్నలిస్టు మిత్రులకు ఆయన సూచించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ మీటింగ్కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. కారు దిగి నేరుగా జర్నలిస్టుల వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న జర్నలిస్టులతో కొంతసేపు మాట్లాడారు. ముందుగా వారందరికీ నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆయన జర్నలిస్టులకు మోదీ సూచించారు. అనారోగ్యం బారిన పడకుండా తలను కప్పుకోండి అంటూ ఆయన సలహా ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Post Views: 63







