ప్రముఖు ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ఛానెల్ నెంబర్ వన్ గా దూసుకెళ్లాలంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆకాంక్షించారు. శనివారం జిల్లా కేంద్రంలోని తిరుమల హిల్స్ లో ఏఎన్ ఎన్ (అమ్మ న్యూస్) నూతన సంవత్సర క్యాలెండర్ ను వనపర్తి జిల్లా రిపోర్టర్ ఈశ్వర్ సాగర్ ఆధ్వర్యంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ
ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ ప్రజా సమస్యలను వెలికితీయడానికి విశేషంగా కృషి చేయడంతోపాటు వాటి పరిష్కారానికి బాధ్యతగా ముందుకు నడుస్తుందని అన్నారు. ప్రజల ఆకాంక్షతో కొనసాగుతున్న ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ ను ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా మెలగాలని ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, వనపర్తి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, జర్నలిస్టులు ఆంజనేయులు, సుంకరి రమేష్, దినేష్, చిన్న రాజు, మల్లికార్జున్, శ్రీనాథ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.







