Mahaa Daily Exclusive

  ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ట్రంప్‌ను ఓడించేవాడిని : జో బైెడెన్ సంచలన వ్యాఖ్యలు

Share

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ చేతిలో కమలా హారిస్‌ ఓటమిపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోటీల్లో తాను ఉంటే కచ్చితంగా ట్రంప్‌ను ఓడించేవాడినని విశ్వాసం వ్యక్తం చేశారు. డెమొక్రటిక్‌ పార్టీలో ఐక్యత కోసమే పోటీ నుంచి వైదొలిగానని బైడెన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో తిరిగి పోటీ చేయకూడదనే నిర్ణయంపై విచారిస్తున్నారా? ఆ చర్య ట్రంప్‌ మళ్లీ అధ్యక్షుడు కావడానికి సహాయపడిందా? అంటూ విలేకరులు అడిగి ప్రశ్నకు బైడెన్ ఈ మేరకు స్పందించారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను కమలా హారిస్ ఓడించగలదని అనుకున్నాం. అందుకే ఆమెకు మద్దతిచ్చాం. ఇప్పటికీ కమలా విజయం సాధించగలని నమ్ముతున్నా. అమెరికా రాజకీయాల్లో కనిపిస్తున్న విభజనకు స్వస్తి పలకడానికే అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నా. నేను ఎన్నికల బరిలో ఉంటే ట్రంప్‌ కచ్చితంగా ఓడిపోయేవారు’ అని బైడెన్ అన్నారు

Latest