అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఆర్థిక, అనారోగ్య కారణాలతో సతమతమవుతున్న ప్రగడ బాబుజీ కుటుంబానికి తిమ్మాపురం జనసైనికులు చేయుతను అందించి అండగా నిలిచారు. శానాపతి బాబురావు (మాష్టారు) ఆధ్వర్యంలో దాతల నుండి సేకరించిన రూ. 67,500ను జనసేన పార్టీ తిమ్మాపురం అధ్యక్షుడు ప్రసాదుల గణేష్ చేతుల మీదుగా ఆ కుటుంబానికి అందచేసి వారి దాతృత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అప్పికొండ బుజ్జి, శానాపతి లోవరాజు, వంగలపూడి నానాజీ, జంప శ్రీనివాస్, వంగలపూడి రాము, టేకు చందు, దమ్మ రాజు, శానాపతి శ్రీరామ్ కుమార్, ప్రగడ శ్రీనివాస్, ప్రగడ పోతురాజు,సమ్మెంగి శ్రీనివాస్, సమ్మెంగి వికాస్, తర్ర బాలు, గుర్రం బాబి, గణేష్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 69







