ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాలతో దుగ్గొండి గ్రామం శివారులోని నల్లబెల్లి రోడ్ వెైపులో గల పెద్ద చెరువు దగ్గర ప్రకాష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నిస్తున్నాడంటూ దుగ్గొండి పోలీస్ స్టేషన్ కు 100 డయల్ ద్వారా శనివారం సమాచారం రావడంతో పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ రాకేష్ లు ఇద్దరు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అనంతరం ఆ వ్యక్తి చేతిలో ఉన్న పురుగులమందు డబ్బాను లాక్కొని అతడిని కాపాడారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేయించి, 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రకాశ్ కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపారు.
Post Views: 58







