ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుప్టి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారి పక్కనే రూ. కోట్ల విలువ చేసే ఎర్రమట్టిని బకాసురులు మింగేస్తున్నారు. ఎర్ర మట్టి ఒక్కో టిప్పర్ విలువ దాదాపు రూ. 12 వేలకు పైగా ఉండగా ప్రతీరోజూ అర్ధరాత్రి అయితే చాలు పెద్ద పెద్ద మిషన్ లను పెట్టి గుట్టలు గుట్టలనే తవ్వేస్తూ టిప్పర్లతో ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ప్రతీ రోజూ రూ. లక్షల్లో దందా చేస్తూ అడ్డొచ్చిన చెట్లను సైతం నరికేస్తూ అడ్డు అదుపు లేకుండా ఇష్టారీతిన దందా కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు మైనింగ్ అధికారులు ఇటు అటవీశాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Post Views: 56







