పట్టణంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వివేక్ చౌక్, అంబేద్కర్ చౌక్, బస్టాండ్ ప్రాంతంలో నిర్మల్ డివిజన్ అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి శనివారం ఎస్పీ పర్యటించారు. రోడ్లపై వ్యాపారం చేస్తున్నవారితో మాట్లాడారు. రహదారులపై వాహనాలు నిలపవద్దని సూచించారు. ఎస్పీ వెంట పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
Post Views: 69







