కంది శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏఎన్ఎన్ ఛానల్ నూతన క్యాలెండర్ ను కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరికి నూతన సంవత్సర, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏఎన్ ఎన్ ఛానల్ మంచి కార్యక్రమాలతో లక్షలాది మంది వీక్షకుల అభిమానాన్ని పొందిందన్నారు. మిత్రులు, అభిమానుల ఆకాంక్షల మేరకు వార్తలు అందిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రీజనల్ కో ఆర్డినేటర్ సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, జాఫర్ అహ్మద్, నాయకులు బూర్ల శంకరయ్య,కిజర్ పాషా, ఎంఏ కయ్యుమ్, దాసరి ఆశన్న, మొహమ్మద్ రఫీక్, దీపక్ రావు, ప్రకాష్, ఎల్మ రామ్ రెడ్డి, అశోక్, విట్టల్ రెడ్డి, భీమనవేణి రవి, రాములు, మానే శంకర్, షౌకత్ అలీ, మహమూద్, అయాస్ తదితరులు పాల్గొన్నారు.







