Mahaa Daily Exclusive

  ఏఎన్ఎన్ ఛానల్ – వాగ్ధేవి కళాశాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు భోగి మంటలు, రంగురంగుల హరివిల్లు ..!

Share

అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఏఎన్ఎన్ శాటిలైట్ ఛానల్ – వాగ్దేవి కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో విద్యార్థులు పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. పెద్ద ఎత్తున రంగుల హరివిల్లుగా ముగ్గులను వేసి చూపరులను ఆకట్టుకున్నారుత. ఈ సందర్భంగా భోగి మంటలతో రంగుల హరివిల్లుతో వాగ్దేవి కళాశాల సందడిగా మారింది. ఈ ముగ్గుల పోటీలకు న్యాయకర్తలుగా అడపా కృష్ణవేణి, అరుణ, సరళలు వ్యవహరించారు. వారికి వాగ్దేవి కళాశాల యాజమాన్యంతోపాటు విద్యార్థులు స్వాగతం పలికారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు కళాశాల యాజమాన్యం అడపాశేషగిరిరావు, ప్రకాష్, సుబ్బారాయుడుల చేతులమీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటలను వేసి సంబరాలు జరిపారు. కృష్ణవేణి, అరుణ, సరళలు మాట్లాడుతూ .. వాగ్దేవి కళాశాలలో ముగ్గుల పోటీలను ప్రతీయేటా ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ పోటీలకు న్యాయ కర్తలుగా రావడం సంతోషంగా ఉందన్నారు. ఆ ముగ్గుల పోటీలను ఈ ఏడాది ఏఎన్ఎన్ ఆధ్వర్యంలో నిర్వహహించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులకు ముగ్గులు అనేవి తెలియకుండా పోయిందని, అలాంటి పరిస్థితి నుండి విద్యార్థులు సంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తున్న కళాశాల యాజమాన్యంకు, వారికి సహకారాన్ని అందించిన ఏఎన్ఎన్ ఛానల్ మరియు మహా పత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Latest