మూడు ప్రధాన నౌకాదళ యుద్ధనౌకలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. INS సూరత్, INS నీలగిరి, INS వాఘ్‌షీర్‌లను దేశానికి అంకితం చేయడం, రక్షణ తయారీ, సముద్ర భద్రతలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలనే భారతదేశ కలను సాకారం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగు.
ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో భారత్ అగ్రగామి కావాలన్న లక్ష్యసాధన దిశగా మరో ముందడుగు పడింది. భారత నావికా దళం మరింత బలాన్ని పుంజుకుంది. నేవీ అమ్ముల పొదిలోకి అధునాతన యుద్ధనౌకలు చేరాయి. INS సూరత్, INS నీలగిరి, జలాంతర్గామి INS వాఘ్‌షీర్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో INS సూరత్, INS నీలగిరి, INS వాఘ్‌షీర్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం నవీ ముంబయిలోని ఖర్ఘర్‌లోని శ్రీశ్రీశ్రీ రాధా మదన్‌మోహన్‌జీ ఆలయాన్ని ఇస్కాన్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.








