Mahaa Daily Exclusive

  చిలుకూరు ఆలయంలో ప్రియాంకా చోప్రా …!

Share

ప్రముఖ హాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా హైదరాబాద్‌ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మంగళవారం సందర్శించారు. సంబంధిత ఫొటోలను సోషల్‌ మీడియాలో ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్టు ఆ పోస్టులో రాసుకొచ్చారు. భగవంతుడి దయ అనంతమైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు జోడించారు. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. సూపర్​ స్టార్​ మహేశ్‌ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న ఎస్ఎస్ఎంబి29 లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఎంపికయ్యారంటూ ఇటీవల చాలా వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌ వచ్చారంటూ నెట్టింట పలు చర్చలు కూడా జరిగాయి. ఆ సినిమాను ఉద్దేశించే కొత్త ప్రయాణమని చెప్పినట్టు పలువురు సినీ అభిమానులు ఆ పోస్టును చూసి కామెంట్లను పెడుతున్నారు

Latest