Mahaa Daily Exclusive

  ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు…!

Share

సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న ఆయనకు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పద్మారావుకు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. డెహ్రాడూన్ నుంచి మంగళవారం రాత్రి వరకు ఆయన సికింద్రాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం. తమ అభిమాన నేతకు గుండెపోటు వచ్చిందని తెలియడంతో పద్మారావు అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందాయి. పద్మారావు ఆరోగ్యం నికలడగా ఉందని, పూర్తిగా కోలుకున్నారని వైద్యులు చెప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, పద్మారావు గౌడ్ మంగళవారం రాత్రి సికింద్రాబాద్ చేరుకున్నారు.

బీఆర్ఎస్ పార్టీ పెద్దలు పద్మారావు గౌడ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. కాగా, పద్మారావు గౌడ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1986వ సంవత్సరంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మోండా మార్కెట్ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కార్పొరేటర్‌గా గెలిచారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిలో 2001లో చేరి 2002లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండోసారి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

Latest