మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలకు మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ లోని బెల్జియన్ వాఫిల్ స్టోర్ ఎదురుగా ఉన్న మైదానం భారీ ఏర్పాట్ల మధ్య అందంగా ఆహ్లాదకర వాతావరణంలో ముస్తాబవుతుంది..
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ ను గెలిపించుకున్నారు. నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం పడుతున్న కష్టానికి ప్రజల పై నారా లోకేష్ కు ఉన్న అభిమానానికి గుర్తుగా నారా లోకేష్ జన్మదిన వేడుకలను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు..
23 వ తేదీ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మరియు అభిమానులు పలు రకాల సేవ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.
అందులో భాగంగా మంగళగిరి స్టేడియంలో ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల విజేతలను 23 వ తేదీ బహుమతులు అందిస్తారు..
అనంతరం మెగా రక్తదాన శిబిరాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది..
23 వ తేదీ సాయంత్రం
6 గంటలకు ఆహ్లాదకర వాతావరణంలో ఎన్నారై వై జంక్షన్ వద్ద గల మయూరి టెక్ పార్క్ ఎదురుగా గల మైదాన ప్రాంగణంలో లైవ్ మ్యూజిక్ షో ను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని మన యువ నాయకుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించాలని కోరారు…







