ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సహా 54 మంది రాష్ట్ర మంత్రులు మహా కుంభమేళా నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద నేడు పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తకోటి తరలి వస్తోంది. 45 రోజుల పాటు జరగనున్న ఈ కుంభమేళాలో ప్రతిరోజు కోటి మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మంత్రులతో కలిసి సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈరోజు పుణ్యస్నానాలు ఆచరించారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక హారతి ఇచ్చారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది.
Post Views: 78







