ఆటో డ్రైవరన్నా థ్యాంక్స్..
సైఫ్ ను ఆసుపత్రికి తరలించిన భజన్ సింగ్
నెట్టింటా ఫొటో వైరల్
ప్రశంసిస్తున్న నెటిజన్స్
ముంబై: దుండగుడి దాడిలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. అయితే, అంతకంటే ముందు ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రాణాను ఆసుపత్రిలో కలిశారు. తాను ఆసుపత్రికి వెళ్లేందుకు సాయం చేసినందుకు భజన్ సింగ్ సైఫ్ థ్యాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసి నెటిజన్స్ సైఫ్ ను అభినందిస్తున్నారు. సాయం చేసిన ఆటో డ్రైవర్ ను గుర్తుపెట్టుకుని అతడికి ధన్యవాదాలు తెలపడాన్ని హర్షిస్తున్నారు. అదేవిధంగా సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ కూడా భజన్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ముంబైలోని బాంద్రాలో ఉన్న సైఫ్ నివాసంలో ఈ నెల 16 తెల్లవారుజామున దాడి గురయ్యారు. సైఫ్, అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా తెల్లవారుజాము 2.30 గంటలకు దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి చొరబడ్డాడు. దుండగుడిని చూసిన కేర్ టేకర్ పెద్దగా కేకలు వేశాడు. ఆ కేకలు విన్న సైఫ్ వెంటనే లేచి అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో దుండగుడు, సైఫ్ మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆరు చోట్ల కత్తితో దుండగుడు పొడిచాడు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం సైఫ్ డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.







