AP: మాజీ మంత్రి రోజాపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు. రోజాపై ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. గాలి భాను ప్రకాష్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. రోజాను హీరోయిన్ తక్కువ, వ్యాంప్‌కు ఎక్కువ అని నీచపు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.
Post Views: 55








