మిర్యాలగూడ మహా
బోనాల వేడుకలను మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం లో గల శ్రీ వాగ్దేవి పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ సోమ గాని శ్రీను భవ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు హాజరైనారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ బోనాలు అని బోనాల పండుగను నిర్వహించడం ద్వారాప్రజలు తమ కుటుంబాలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, మరియు శ్రేయస్సు కలగాలని కోరుకుంటారనీ,పిల్లల కు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కలిగించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు,తల్లిదండ్రులకు బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిన్నారులకు డాన్స్ మాస్టర్ వెంకట్ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు చిన్నారులు పోతరాజుల వేషాధారణతో అంగరంగ వైభవంగా కోలాహాలతో పాటశాల ఆవరణం కేరింతలతో ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎడవల్లి నాగరాజు, చీదెళ్ల మాణిక్యం టీచర్లు సుష్మ, కిషోర్, వాణి పద్మ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.








