Mahaa Daily Exclusive

  ధరల వ్యత్యాస పథకం రద్దు చేయాలి అఖిల పక్ష రైతు సంఘాల అధ్యక్షులు బండి దత్తాత్రి..!

Share

ఆదిలాబాద్, మహా

కేంద్ర ప్రభుత్వం ప్రయోగత్మాకంగా ఆదిలాబాద్ జిల్లా రైతుల పత్తి మద్దతు ధరకు సీసీఐ కి బదులు ప్రయివేట్ జరిపేందుకు తీసుకొస్తున్న ధరల వ్యత్యాస చెల్లింపు పథకం రద్దు చేయాలని అఖిల పక్ష రైతు సంఘం అధ్యక్షులు బండి దత్తాత్రి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రం లోని భాశెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం (సీఐటీయూ ఆఫీఫ్ ) లో వివిధ రైతు సంఘాలు, పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ సమావేశం నిర్వహించారు. బండి దత్తాత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసేలా, వ్యాపారులకు లాభం చేసేలా ధరల వ్యత్యాస పథకం ఆదిలాబాద్ జిల్లా లో పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చే సీజన్ లో అమలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నం ఆపాలని దానిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఒక వైపు మద్దతు ధర చట్టం కావాలని అడుగుతుంటే అసలు రైతుల పండించే పంటకు ధరే లేకుండా చేసే విధానం కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ద్వజమెత్తారు. ఆసియా లోనే అధికంగా నాణ్యమైన పత్తి ఉత్పత్తి అయ్యే ఆదిలాబాద్ జిల్లాలో అమలు చేయడాన్ని ఖండిస్తున్నామని, ఈ పథకానికి వ్యతిరేకంగా రైతులను చైతన్యం చేసి పోరాటాలకు సన్నద్ధం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నీతి అయోగ్ సమావేశం లో వ్యతిరేకించిన దానిని అమలు చేసేందుకు చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల తరపున అమలు కాకుండా చూడాలని స్పష్టం చేశారు. పాత పద్దతిలో సీసీఐ ద్వారా పత్తి కనుగొళ్ళు మద్దతు ధర చెల్లించి అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అఖిల పక్ష రైతు సంఘాల నేతలు కొండ రమేష్, లోకారి పోశెట్టి, పీసీసీ మాజీ కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, అల్లూరి సంజీవ్ రెడ్డి, బీఆర్ ఎస్ సీనియర్ నేత విజ్జగిరి నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, లంకా రాఘవులు, సిపిఐ నేత దేవిదాస్, సిపిఐ ఎం ఎల్ నేత వెంకట్ నారాయణ, ప్రజా పంథా నేత జగన్ సింగ్, రైతు స్వరాజ్య వేదిక నాయకులు బొర్రన్న,ఆదివాసీ సంఘం నేత పూసం సచిన్, సీఐటీయూ నేతలు అన్నమొల్ల కిరణ్, ఆశన్న, రైతు నేతలు విట్టల్, లక్ష్మణ్, రాజేశ్వర్ కత్రి తదితరులు పాల్గొన్నారు

Latest