Mahaa Daily Exclusive

  ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పై పోలీసులకు ఫిర్యాదు జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి..!

Share

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని, రంగారెడ్డి జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, షాబాద్ పోలీస్ స్టేషన్ సీఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… ఖమ్మం జిల్లాలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలాని వాడుతూ, అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత పది సంవత్సరాల కాలంలో, అభివృద్ధి పేరుతో అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ముఖ్యమంత్రిపై నోరు జారి, అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, మాజీ మంత్రిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, అశోక్, నాయకులు జనార్దన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నర్సింలు, సంజీవరెడ్డి, కృష్ణారెడ్డి, కిషోర్, సుభాష్, రాహుల్, లింగం, మాధవరెడ్డి, రఫిక్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు…

Latest