వరంగల్ మహా;
వరంగల్ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామంలో మండల అధ్యక్షులు మాదాసు ప్రణయ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, జాతీయ కౌన్సిల్ మెంబర్ మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా
వారూ మాట్లాడుతూ..
ఏకాత్మ మానవత వాదాన్ని అంత్యోదయ విధానాన్ని రూపొందించి, అందరికీ స్వేచ్ఛ సమానత్వం న్యాయం జరగాలనే ఉద్దేశంతో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలతో అడుగుజాడలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకు చేరే విధంగా నాయకులు కృష్ణ చేయాలని అలాగే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి బిజెపి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు బండి సాంబయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, జిల్లా నాయకులు, మండల కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








