Mahaa Daily Exclusive

  ఇండోర్ స్టేడియంలో పర్యటించిన కమిషనర్ ఎంజీఎం లో ఎస్ టి పి ప్లాంట్ పనితీరు పరిశీలన..!

Share

వరంగల్ మహా;

క్రీడాకారుల కు వివిధ క్రీడాంశాల్లో అందించే శిక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల ఇండోర్ స్టేడియం తో పాటు ఎంజీఎం లో కొనసాగుతున్న ఎస్ టి పి కేంద్రాన్ని కమిషనర్ శనివారం క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఇండోర్ స్టేడియం ను సందర్శించి షటిల్ కోర్టులు, జిమ్ సెంటర్ , టేబుల్ టెన్నిస్ కోర్టు లను పరిశీలించి శిక్షణ అందిస్తున్న క్రీడలను డి ఎఫ్ ఓ ను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు స్టేడియం లో ఎంతమంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు, ఎంత రుసుము చెల్లిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మరింత శిక్షణ పొందే క్రీడాకారుల సంఖ్యను పెంచి బలోపేతం చేయాలని కమిషనర్ సూచించారు. ఆయా క్రీడలలో శిక్షణ ఇవ్వడానికి శిక్షకులను (కోచ్ లు) నియమించుటకు వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్ డి ఎఫ్ ఓ ను ఆదేశించారు. ఇదే ప్రాంతంలో కొనసాగుతున్న స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం గా పూర్తి చేసి త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎంజీఎం లో 750 కే ఎల్.డి.సామర్ధ్యం తో నిర్వహిస్తున్న మురికి నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని( ఎస్ టి పి) ప్రత్యక్షంగా పరిశీలించి నీటి సేకరణ విధానం తోపాటు శుద్ధీకరణ ప్రక్రియను కమిషనర్ పరిశీలించారు.
ప్లానిటోరియం లో కొనసాగుతున్న పునరుద్ధరణ సుందరీకరణ పనులను కూడా కమిషనర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ శంకర్ లింగం ఇంచార్జి ఎస్ ఈ మహేందర్ డి ఈ లు రాజ్ కుమార్ రాగి శ్రీకాంత్ ఏ ఈ హబీబ్ తదితరులు పాల్గొన్నారు.

Latest