Mahaa Daily Exclusive

  ‘యాదవోంకా ఖదర్.. హైదరాబాద్ సదర్’: శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌లో సీఎం రేవంత్ రెడ్డి – అండగా ఉంటారంటూ హామీ!

Share

  • యాదవోంకా ఖదర్.. హైదరాబాద్ సదర్
  • శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో వైభవంగా కార్యక్రమం
  • హాజరైన సీఎం, మంత్రులు, హరియాణా మాజీ గవర్నర్, బీజేపీ స్టేట్ చీఫ్
  • నమ్మిన వారికోసం ఎంత కష్టమొచ్చినా యాదవులు అండగా నిలబడుతారన్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మహా: హైదరాబాద్‌లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన సదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి ప్రభుత్వంలో తగిన ప్రాతినిథ్యం, సముచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ – ఎన్టీఆర్ స్టేడియంలో యాదవ సోదరులు శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నమ్మిన వారికోసం ఎంత కష్టమొచ్చినా, నష్టమొచ్చినా యాదవులు అండగా నిలబడుతారని, వారి అండతోనే హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడులకు ఆదర్శ నగరంగా మారిందని ప్రశంసించారు.

ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని..
యాదవ సోదరుల ఖదర్ హైదరాబాద్ సదర్ అని, ఎంతో చరిత్ర కలిగిన సదర్ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరినప్పుడు వెంటనే ఆమోదించడమే కాకుండా నిధులు కేటాయించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. యాదవుల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు, ఎంపీ అనిల్ కుమార్‌తో పాటు సదర్ సమ్మేళన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest