- అందరి లెక్కలు తేలస్తాం
- ఇంతకు ముందు లెక్క ఉండదు
- ఇప్పటివరకు ఒక్క లీడర్ ఇంటిని కూల్చలేకపోయింది
- దిక్కుమాలిన విధానాలతోనే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్
హైదరాబాద్, మహా: ఇంతకు ముందు లెక్క ఉండదని.. అందరి లెక్కలు తేలస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పలువురు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో ఆదివారం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆక్రమణల పేరుతో పేదల ఇండ్లను కూలుతున్నారని.. ఇప్పటివరకు ఒక్క బడా వ్యక్తి ఇంటిని కూల్చలేకపోయిందని.. మూసీకి అడ్డంగా కడుతున్నవారిని ఎవరూ పట్టించుకోవట్లేదని విమర్శించారు. పేదల ఇళ్లు కూలిస్తే అడిగేవారే లేరని భావిస్తున్నారన్నారు. పెద్దల వద్ద డబ్బులు గుంజి బెదిరింపులకు దిగుతున్నారని.. రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి ప్రభుత్వ విధానాలే కారణమని మండిపడ్డారు.
పనులు చేయకుండా దందాలు చేస్తున్నారు..
ఈ దిక్కుమాలిన ఆలోచనలు, విధానాలతోనే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని విమర్శించారు. అధికారంలోకి రాగానే సీఎం మొదట దెబ్బకొట్టింది రాజేంద్రనగర్ నియోజకవర్గాన్నేనన్నారు. 2023 కేబినెట్ భేటీలో 400 కిలోమీటర్ల మెట్రో మంజూరు చేశామని.. ఎయిర్‌పోర్టు మెట్రోకు టెండర్లు పూర్తి చేస్తే రేవంత్ వచ్చాక రద్దు చేశారని.. తనకు భూములు ఉన్నాయనే అనుమానంతో ఆ పని చేశారని విమర్శించారు. రాజేంద్రనగర్‌లో భూములున్నాయని సబితా ఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారని.. భూములు చూపితే రాసిస్తానని సబితా ఇంద్రారెడ్డి చెబుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డికి తాను బంపర్ ఆఫర్ ఇస్తున్నా.. భూములు ఎక్కడున్నాయో చూపించాలని.. కంపెనీలు, భవనాలు నావేనని చెబుతూ రెండేళ్లుగా జల్లెడ పడుతున్నారన్నారు. గత దీపావళికి మంత్రి బాంబులేటి.. బాంబులు పేలుతాయని చెప్పారని.. మళ్లీ దీపావళి వచ్చిందంటూ చురకలంటించారు. బీఆర్ఎస్ హయాంలో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి తీసుకువెళ్లామని.. కాంగ్రెస్ పాలనలో పారిశ్రామివేత్తలకు తుపాకులు పెడుతున్నారని.. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా దందాలు చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు








