- గ్రామాలలో సుంకిరెడ్డి మొబైల్ హెల్త్ క్యాంప్ సేవలు..
- చల్లంపల్లి గ్రామంలో విజయవంతంగా ముగిసిన సుంకిరెడ్డి ఉచిత వైద్య శిబిరం సేవలు..
ఆమనగల్లు, మహా:
కడ్తాల్ మండల పరిధిలోని చల్లంపల్లి గ్రామంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సి ఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది.ఈ ఉచిత శిబిరంలో చల్లంపల్లి గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొనగా,300 మందికిపైగా విజయవంతంగా వైద్య పరీక్షలు పూర్తి చేసి,
నిపుణులైన వైద్యుల బృందంతో వారి రిపోర్ట్ మేరకు సలహాలు,సూచనలతో పాటు
సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సమకూర్చిన ఆర్గానిక్ హెల్త్ కిట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా..
సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ నిరుపేద ప్రజల ఆరోగ్యం పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగానే మా ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఉచిత ప్రాథమిక వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో మొబైల్ హెల్త్ క్లినిక్ సేవలతో ప్రతి కుటుంబానికి అందుబాటులోకి వెళ్తున్నామని చల్లంపల్లి గ్రామంలో మా ఐదవ క్యాంప్ నిర్వహణ చాలా సంతోషంగా ఉందని,ఇక్కడ దాదాపు 300 మంది వరకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించామని,అలాగే నిపుణులైన వైద్య బృందంతో వారికి తగిన సలహాలు సూచనలు అందిస్తూ వారికి ఆర్గానిక్ హెల్త్ కిట్స్ కూడా పంపిణీ చేశామని, ఇంత పెద్ద ఎత్తున క్యాంప్ సేవలు వినియోగించుకున్న గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ,మా ఉచిత మొబైల్ హెల్త్ క్లినిక్ సేవలు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్విరామంగా కొనసాగుతాయని తెలియజేశారు… ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చల్లా సురేందర్ రెడ్డి,చల్లా మాధవ రెడ్డి,గోసుల తిరుపతిరెడ్డి,పర్వతాలు యాదవ్,నాయిని నరేందర్,చల్లా అమర్నాథ్ రెడ్డి,మాలే శ్రీశైలం గౌడ్,గడ్డం వెంకటేష్,మర్ల శ్రీశైలం యాదవ్,పోతుగంటి అశోక్, మాలే రాములు గౌడ్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు








