Mahaa Daily Exclusive

  కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అన్నదమ్ములు..బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఫైర్

Share

  • కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అన్నదమ్ములు
  • జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రెండూ చేసిందేమీ లేవు
  • బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఫైర్
  • బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు

హైదరాబాద్, మహా: బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు బీజేపీ అభ్యర్థి. మరి కాసేపట్లో వెంకటగిరి కాలనీ నుంచి ర్యాలీ మొదలుకానుంది. ఈ ర్యాలీలో బీజేపీ అగ్ర నాయకులు పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని ఆ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే అంటూ వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్… జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ రోడ్లను చూస్తేనే తెలుస్తోంది వారు చేసిన అభివృద్ధి ఏంటనేది అని అన్నారు. ఎక్కడ చూసినా రోడ్లపై మురుగు నీరు పారుతోందని తెలిపారు. అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. గెలిపిస్తే పోరాటం చేసైనా జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు అన్నదమ్ముల లాంటి వారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటే అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని లంకల దీపక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Latest