హైదరాబాద్, మహా : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గం ఇబ్రహీం నగర్‌లోని బస్తీ దవాఖానకు కేటీఆర్ పరిశీలించారు. బస్తీ దవఖానను సందర్శించి పేషెంట్‌ల సమస్యలపై ఆరా తీశారు. గతంలో ప్రజలకు, ముఖ్యంగా పేదలు అందరికీ అందుబాటులో ఉండేలా 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశాము. వాటితో పాటు తెలంగాణ డయాగ్నస్టిక్స్ సెంటర్లను ఏర్పాటు చేసి, ప్రజలకు ఉచితంగా పరీక్షలు కూడా అందుబాటులోకి తేచ్చామని అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి, దానికి అనుబంధంగా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టారు, బస్తీ దవాఖానాలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్తీ దవాఖానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేటీఆర్ విమర్శలు చేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయన పేరు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎలా వచ్చింది?. ఆయన ఏ పార్టీలో గెలిచారు, ఏ పార్టీలో చేరారు అనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యేల చేరికల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నీతి లేదు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు, తాము ఏ పార్టీలో చేరామో కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. మా పార్టీ ఎమ్మెల్యేలు చేరలేదని చెప్తూనే, సిగ్గు లేకుండా మా పార్టీ ఎమ్మెల్యే పేరును స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఏఐసీసీ చేర్చిందని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు








