Mahaa Daily Exclusive

  అక్టోబర్ 26 జాబ్ మేలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

Share

  • బెల్లంపల్లి ఏఎంసి క్రీడా మైదానానికి హాజరుకానున్న 70 కంపెనీలు
  • మందమర్రి ఏరియా జిఎం రాధాకృష్ణ వెల్లడి

    మందమర్రి, మహా : అక్టోబర్ 26 నాడు సింగరేణి యాజమాన్యం తలపెట్టిన జాబ్ మేలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మందమర్రి జిఎం ఎన్ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక జిఎం కార్యాలయం ఛాంబర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాంల ఆదేశాల మేరకు అక్టోబర్ 26 బెల్లంపల్లి ఏ.ఎం.సీ గ్రౌండ్ లోన ఉదయం 8.30 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ, నోబల్ ఎంపవరమెంట్, వారిచే సంయుక్తంగా మెగా జాబ్ మేళా–2025 ను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ జాబ్ మేళాకు, మందమర్రి, బెల్లంపల్లి, పరిసర ప్రాంతాలలోని నిరుద్యోగ యువత వారి వారి సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు. బెల్లంపల్లి రీజియన్ కోల్ బెల్ట్ ప్రాంతంలో ఇదివరకే జాబ్ మేళా గురించి విస్తృతంగా ప్రచారం చేసినట్లు చెప్పారు. ఈ మేళాకు 7000 మంది నిరుద్యోగులు హాజరుకానున్నట్లు తెలిసిందని అన్నారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 70 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని జిఎం తెలిపారు.ఇక్కడికి వచ్చే కంపెనీలలో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, ఐటి, నాన్ ఐటి, డిజిటల్ మార్కెటింగ్, సర్వీస్ సెంటర్లకు చెందిన ప్రముఖ సంస్థలు నియమాకాలు చేపడతారని వివరించారు. సాధ్యమైనంతవరకు ఇంటర్వ్యూకు హాజరైన రోజే నియామక పత్రాలు అందే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. సింగరేణి సంస్థ కేవలం బొగ్గు ఉత్పత్తి కే పరిమితం కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందుంటుందని అన్నారు. ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా వారి సొంత ప్రాంతంలోనే వివిధ రంగాల ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు పొందేలా ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దీని ద్వారా స్థానిక యువత ఉజ్వల భవిష్యత్తుకు పునాది పడుతుందని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు సింగరేణి సంస్థ కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు జి.ఎం విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఐ.ఈ.డి ఎస్.ఈ కిరణ్ కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ, గోగర్ల శోభన్ బాబు నోబెల్ ఎంపవర్మెంట్ స్టేట్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

Latest