- ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు ఉప రాష్ట్రపతి
- స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, మంత్రులు
హైదరాబాద్, మహా : ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, ప్రభుత్వ సలహాదారు వేం. నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, జిల్లా అదనపు కలెక్టర్ జి. ముకుంద రెడ్డి, నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్ భవన్ చేరుకున్న ఉప రాష్ట్రపతి గవర్నర్ ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు. అనంతరం నేరుగా రామోజీ ఫిలిం సిటీకి చేరుకుని అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ బయలు దేరి వెళ్ళారు. ఉపరాష్ట్రపతికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.








