హైదరాబాద్, మహా: తెలుగు రాష్ట్రాల్లో కరాటే మాస్ గేమ్ అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం గచ్చిబౌలి ఎన్ఎస్ఎన్ కరాటే లీగ్ 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రామస్వామి, కీర్తన్, నాని, శ్రీపాల్, హరీష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కరాటే నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటే స్టాండర్డ్స్ ఆటగాళ్లు రావాలని కోరారు. ఇలాంటి ఈవెంట్స్ ప్రతి ఏటా జరగాలని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Post Views: 25








