Mahaa Daily Exclusive

  ఆ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదు..

Share

  • ఇండస్ట్రీయల్ పాలసీ ప్రతిపక్షాల ఫేక్ ప్రచారం
  • బీజేపీ, బీఆర్ఎస్ మేం తెచ్చిన పాలసీ అర్థం కాలేదు
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి

 

హైదరాబాద్, మహా: ఇండస్ట్రీయల్ పాలసీపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని పొల్యూషన్ ఫ్రీగా చేయడమే తమ ప్రభుత్వ పాలసీ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తెచ్చింది పారదర్శకమైన పాలసీ అని చెప్పుకొచ్చారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తాము తెచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కాలేదని తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ఓఆర్ఆర్ బయటకు పంపాలనే డిమాండ్ ఉందని గుర్తుచేశారు. ఈ పాలసీ తమ ప్రభుత్వం కొత్తగా తెచ్చినది కాదని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఈ పాలసీపై చర్చ జరిగిందని గుర్తుచేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

 

ఎలాంటి కుంభకోణం జరగలేదు..

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది లేదని… పాలసీ మార్చేది లేదని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీయల్ పాలసీ రూపకల్పనలో తాను భాగమై ఉన్నానని వివరించారు. కొత్త ఇండస్ట్రీయల్ పాలసీతో తెలంగాణ రాష్ట్రానికి అదనపు ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాల నేతలకు వ్యతిరేకించాలనే ఉద్దేశ్యం తప్పా ఏం లేదని విమర్శించారు. అయితే, నల్గొండ డీసీసీ నియామకంపై స్పందించడానికి నిరాకరించారు. పార్టీ ఇంటర్నల్ విషయాలను బయట మాట్లాడనని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తమ ప్రభుత్వంలో విద్యుత్‌ శాఖలో ఎలాంటి కుంభకోణం జరగలేదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ హయాంలో భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్టు పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ఇండియా బుల్ అనే కంపెనీ దగ్గర ఉపయోగంలో లేని ఎక్విప్‌మెంట్ ఎందుకు కొన్నదని ప్రశ్నించారు. భద్రాద్రి ప్రాజెక్టులో అవుట్ డేటెడ్ టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఏముంది..? అని నిలదీశారు. భద్రాద్రి ప్రాజెక్టు అనవసరంగా తెలంగాణ ప్రజలపై రుద్దిన ప్రాజెక్టు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు.

Latest