Mahaa Daily Exclusive

  యూపీఎస్ సీ  సివిల్స్ ఫలితాలు విడుదల..! టాపర్స్ వీరే..

Share

న్యూఢిల్లీ, మహా : భారత దేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష (యూపీఎస్ సీ సీఎస్ఈ 2025) తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడిన ఈ పరీక్షలో చివరకు అనుజ్ అగ్నిహోత్రి ఆలిండియా మొదటి ర్యాంక్ సాధించి విజేతగా నిలిచారు. మొత్తం 1087 ఖాళీలకు గాను, యూపీఎస్‌సీ ప్రస్తుతానికి 958 మంది అభ్యర్థులను వివిధ సర్వీసులకు సిఫార్సు చేస్తూ జాబితాను ప్రకటించింది. జాతీయ స్థాయిలో సత్తా చాటిన టాప్ 10 అభ్యర్థులలో అనుజ్ అగ్నిహోత్రి మొదటి స్థానంలో నిలవగా, రాజేశ్వరి సువే రెండో ర్యాంక్, ఆకాంష్ ధుల్ మూడో ర్యాంక్ సాధించారు. 2025 ఆగస్టులో జరిగిన రాత పరీక్షలు (మెయిన్స్), ఆ తర్వాత 2026 ఫిబ్రవరిలో నిర్వహించిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఆధారంగా ఈ తుది ఎంపిక జరిగింది. ఎంపికైన వారు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తో పాటు కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ ‘ఎ’, గ్రూప్ ‘బి’ విభాగాల్లో ఉన్నత పదవులను అలంకరించనున్నారు.

 

టాప్ 20 అభ్యర్థుల వివరాలు

 

1. అనుజ్ అగ్నిహోత్రి (రోల్ నెం. 1131589)

2. రాజేశ్వరి సువే (4000040)

3. ఆకాంష్ ధుల్ (3512521)

4. రాఘవ్ ఝున్‌ఝున్‌వాలా (0834732)

5. ఈషాన్ భట్నాగర్ (0409847)

6. జినియా అరోరా (6410067)

7. ఏ.ఆర్. రాజా మోహైదీన్ (0818306)

8. పక్షల్ సెక్రటరీ (0843487)

9. ఆస్థ జైన్ (0831647)

10. ఉజ్వల్ ప్రియాంక్ (1523945)

11. యశస్వి రాజ్ వర్ధన్ (1512091)

12. అక్షిత్ భరద్వాజ్ (0840280)

13. ఆన్య శర్మ (7813999)

14. సురభి యాదవ్ (5402316)

15. సిమ్రన్‌దీప్ కౌర్ (3507500)

16. మోనికా శ్రీవాస్తవ (0867445)

17. చిత్వాన్ జైన్ (0829589)

18. శృతి ఆర్ (5604518)

19. నిషార్ దిశాంత్ అమృతలాల్ (0105602)

20. రవి రాజ్ (6630448)

 

తెలుగు తేజాలు

 

55వ ర్యాంకు – సృజన 193వ ర్యాంకు- డీఎస్‌కే ప్రచేత్‌ , 259వ ర్యాంకు- ఎస్‌ వర్షిత్‌ రెడ్డి, 297వ ర్యాంకు- ఎం.పవన్‌కుమార్ రెడ్డి, 541వ ర్యాంకు- వెలిమినేటి విక్రమసింహారెడ్డి , 573వ ర్యాంకు- గుమ్మల శ్వేత, 640వ ర్యాంకు-పల్లి ప్రమోద్‌ విష్ణు, 682వ ర్యాంకు-గుమ్మల విజయసింహారెడ్డి, 738వ ర్యాంకు-పోతుపురెడ్డి భార్గవ్‌, 748వ ర్యాంకు- పుడారి రాహుల్‌, 768వ ర్యాంకు- కుమ్మరి శ్రవణ్‌కుమార్‌, 786వ ర్యాంకు-అనిరుధ్‌ కత్తిమాని, 806వ ర్యాంకు-కోరపోతుల శ్రీకర్‌రాజు, 823వ ర్యాంకు- ఇస్లావత్‌ శ్రీరామ్‌ హర్ష, 908వ ర్యాంకు- కట్టా ప్రత్యూష, 920వ ర్యాంకు- గోగుల రాజశేఖర్‌, 939వ ర్యాంకు- గుగులోతు జితేందర్‌ నాయక్‌ ఉన్నారు.

 

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు

 

ఈ ఏడాది మొత్తం 1087 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాగా, కేటగిరీల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి: ఐఏఎస్ 180 పోస్టులు (జనరల్-74, ఓబీసీ-47, ఎస్సీ-28, ఎస్టీ-13, ఈడబ్ల్యూఎస్ -18) ఐపీఎస్ 150 పోస్టులు (జనరల్-60, ఓబీసీ -42, ఎస్సీ-22, ఎస్టీ-11, ఈడబ్ల్యూఎస్ -15) ఐఎఫ్ఎస్ (భారత విదేశీ సేవ) 55 పోస్టులున్నాయి. ఇతర కేంద్ర సర్వీసుల్లో గ్రూప్ ‘ఎ’లో 507, గ్రూప్ ‘బి’లో 195 పోస్టులు ఉన్నాయి.

Latest