Mahaa Daily Exclusive

  ఐ అండ్ పీఆర్ కార్యాలయంలో ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం..

Share

  • ఐ అండ్ పీఆర్ కార్యాలయంలో
  • ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
  • హాజరైన స్పెషల్ కమిషనర్ ప్రియాంక

 

హైదరాబాద్, మహా :  జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తొలిరోజు మాసాబ్ ట్యాంక్ లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో సమాచార శాఖ  స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో పరిసరాలను కార్యాలయంలోని ప్రతి సెక్షన్ ను ప్రియాంక తనిఖీ చేసారు. అనంతరం అధికారులు సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి సెక్షన్ లో ఉన్న ఫైళ్లను  సక్రమంగా పరిశుభ్రంగా నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న ఫైళ్ళను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నిర్దేశించిన కాలం అనంతరం పాత వార్షిక ఫైళ్లను స్టోర్ రూమ్ లో క్రమపద్ధతి లో భద్రపరచాలని తెలిపారు. బీరువాలు డెసక్ లలో రన్నింగ్ ఫైల్స్ మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. అధికారులు సెక్షన్ ఉద్యోగులు గదులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కిషోర్ బాబు,అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్.జగన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ వి. రాధా కిషన్ ఆర్ఐలు జె. రాములు, పి. జయరాం మూర్తి,  ఉప సంచాలకులు యం. మధు సూదన్, వై. వెంకటేశ్వర్లు,  ఎస్.ఏ, హష్మి, రాజరెడ్డి  కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest