- భానుడి ఉగ్రరూపం
- 40 డిగ్రీల ఉష్షోగ్రతలు మార్చిలోనే..
- క్రమేపీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, మహా
రాష్ట్రం వ్యాప్తంగా భానుడు ఉగ్రరూపాన్ని దాల్చుతున్నాడు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగిపోతున్నాయి. మార్చి ప్రథమార్థంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. సెగలుకక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తీవ్ర వడగాల్పులు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటిచింది. ఇప్పుడే ఎండలు ఈ స్థాయిలో ఉంటే ఏప్రిల్, మే మాసాల్లో పరిస్థితేంటని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పది గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. నీడ పట్టున ఉన్పప్పటికీ వేడి సెగలు ముఖాలను తాకుతుంది. పగటి వేళల్లో జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. దంచుతున్న ఎండల వల్ల చిరు వ్యాపారులతో పాటు ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు ఎండ తాకిడి మరోవైపు జనం బయటకి రాకపోవడంతో అమ్మకాలపై ప్రభావం పడుతోంది. గిరాకీలు రాక వాళ్ల ఉపాధిపైన తీవ్ర ప్రభావం చూపోతుంది.
మార్చి ప్రథమార్థంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే మహాబూబ్‌నగర్, భద్రాచలంలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ 38.8, ఖమ్మం 38.6, నిజామాబాద్ 37.6, రామగుండం 37.6, హైదరాబాద్ 37, మెదక్ 36.6, హన్మకొండ 36, నల్గొండ 34 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలి దిశమార్చుకోవడం వల్లే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ ప్రకటిచింది. తూర్పు గాలులు కాకుండా ఉత్తరాది నుంచి వీస్తున్న పొడిగాలుల వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడిచింది. దీంతో సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పింది. పదో తేదీ నుంచి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అప్పుడు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి 2 డిగ్రీలు తగ్గే అవకాశం ఉన్నట్లు చెప్పింది.







