మహిళా దినోత్సవం సందర్భంగా కౌన్సిలర్ అట్లూరి మంజుల కు ఘన సన్మానం
హుజూర్ నగర్ మహా
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని 23వ వార్డులోని ఉత్తమ్ పద్మావతి నగర్ కు చెందిన మహిళలు మహిళా దినోత్సవం సందర్భంగా 23 వ వార్డు కౌన్సిలర్ అట్లూరి మంజుల ఘనంగా సన్మానించారు. కాలనీ వాసులు ఆమెకు పూలమాలలు వేసి ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అట్లూరి మంజుల మాట్లాడుతూ మహిళా మణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 23వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తనపై ఆదరాభిమానాలు చూపిస్తున్న వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
Post Views: 7







