- పెరిగిన పొగాకు వినియోగదారులు
- ప్రతి మూడు ఇళ్ళలో ఒకరు పోగాకు వినియోగదారులే
- 2023 – 24 గృహ వినియోగ వ్యయ సర్వేలో వెల్లడి
- రెట్టింపైన పొగరాయుళ్ళు
- ఆరు రెట్లు పెరిగిన గుట్కా వినియోగం
- పొగాకు వినియోగం తగ్గిన ఏకైక రాష్ట్రం కేరళ
హైదరాబాద్, మహా : తెలంగాణలో పొగాకు వాడే వారి సంఖ్య పెరిగింది. హైదరాబాద్‌లోని ఇళ్లలో పొగాకు వినియోగం గణనీయంగా పెరిగిందని ఇటీవల ప్రభుత్వ సర్వే వెల్లడించింది. గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24 ప్రకారం భాగ్యనగరంలోని దాదాపు ప్రతి మూడు ఇళ్లలో ఒకరు ఏదో ఒక రకంగా పొగాకును వినియోగిస్తున్నారు. 2011–12లో 14.52 శాతం ఇళ్లలో సిగరెట్ వినియోగం నమోదైంది. 2023-24 నాటికి ఆ సంఖ్య 25.16 శాతానికి పెరిగింది. అంటే ఇప్పుడు ప్రతి నాలుగు ఇళ్లలో ఒకరు సిగరెట్లు తాగుతున్నట్టు లెక్క. నిజానికి హైదరాబాద్‌లో గత దశాబ్దంలో పొగాకు వినియోగం బాగా పెరిగింది. సిగరెట్ వినియోగం దాదాపు రెట్టింపు అయింది. గుట్కా వినియోగం ఆరు రెట్లు పెరిగింది.
2011-12లో తెలంగాణలోని పట్టణ గృహాల్లో ఏడింటిలో ఒకరి కంటే తక్కువ మంది సిగరెట్ తాగేవారు ఉండగా, 2023-24 నాటికి ఈ సంఖ్య నాలుగు గృహాల్లో ఒకటి కంటే ఎక్కువకు చేరింది. ఆదాయ స్థాయిలతో పాటు సిగరెట్ వినియోగం పెరుగుతున్నట్లు సర్వేలో వెళ్ళడైంది. పేద వర్గాలతో పోలిస్తే అధిక ఆదాయం ఉన్న కుటుంబాలు సిగరెట్ వినియోగంలో ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని సర్వే తేల్చింది. తెలంగాణ పట్టణాల్లో గుట్కా వినియోగం బాగా పెరిగిందని సర్వే గుర్తించింది. 2011-12లో పట్టణ గృహాల్లో కేవలం 1.33 శాతం మంది మాత్రమే గుట్కాను ఉపయోగిస్తున్నట్లు తేలగా, 2023-24 నాటికి ఈ సంఖ్య 7.46 శాతానికి పెరిగింది. ఇది దాదాపు ఆరు రెట్లు పెరుగుదల. దీని అర్థం ఇప్పుడు దాదాపు 13 కుటుంబాలలో ఒకరు గుట్కాను వినియోగిస్తున్నారు. గుట్కా వంటి ఉత్పత్తులు నోటి, అన్నవాహిక, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లతో సహా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు కారణమవుతాయని నివేదిక హెచ్చరిస్తోంది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై చైతన్యవంతులను చేసే కార్యక్రమాలను చేపడుతున్నాయి.
సర్వేలో గుర్తించిన ఒక సానుకూల ధోరణి ఏమిటంటే పట్టణ తెలంగాణలో బీడీ వినియోగం తగ్గింది. బీడీ వినియోగం 2011-12లో 4.87 శాతం నుండి 2023-24లో 3.13శాతానికి పడిపోయింది. కానీ ఈ తగ్గుదల మొత్తం పొగాకు వినియోగం తగ్గుదలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. వినియోగదారులు బీడీల నుండి సిగరెట్లు, గుట్కా వంటి ఉత్పత్తులవైపు మళ్లుతున్నారు. పేద కుటుంబాలలో పొగాకు వినియోగం ఎక్కువగానే ఉంటుంది. పేద కుటుంబాలు తమ నెలవారీ ఖర్చులో ఎక్కువ భాగాన్ని పొగాకు ఉత్పత్తుల కోసం ఖర్చు చేస్తున్నారు. విశ్లేషణ ప్రకారం దిగువన ఉన్న 40 కుటుంబాలు తమ నెలవారీ తలసరి ఖర్చులో దాదాపు 4 శాతం పాన్, పొగాకు, మత్తు పదార్థాలపై ఖర్చు చేస్తున్నాయి. పొగాకు ఉత్పత్తులతో క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చి.. చాలా మంది ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, చైతన్యవంతమైన కార్యక్రమాలను చేపడుతున్నా, స్వచ్చంద సంస్థలు ఎంత ప్రయత్నిస్తున్నా పొగాకు వినియోగం తగ్గకపోగా పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పొగాకు వినియోగం తగ్గిన ఏకైక రాష్ట్రంగా కేరళ ఉంది. బీడీ, సిగరెట్, పొగాకు వినియోగం ఇక్కడ తగ్గింది, గుట్కా వినియోగం చాలా తక్కువగా ఉంది. బలమైన విధానపరమైన చర్యలు, నిరంతర ప్రజా అవగాహన ప్రచారాలు పెరుగుతున్న పొగాకు వినియోగాన్ని అరికట్టడంలో సహా








