Mahaa Daily Exclusive

  దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు: కేసీఆర్‌కే నా జవాబుదారీ!

Share

సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ నా బ్యాంక్ అకౌంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కట్ చేసుకుంది. నేను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదు అలా అని కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకోలేదు. పార్టీ అధినేతగా కేసీఆర్ నన్ను ఎలాంటి వివరణ అడగలేదు. నాకెప్పుడూ పార్టీ విప్ జారీ చేయలేదు పార్టీకి వ్యతిరేకంగా నేనెప్పుడూ పని చేయలేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అనడానికి నా దగ్గరున్న ఆధారాలన్నీ స్పీకర్ కి ఇచ్చాను. నాపై పార్టీల పరంగా ఫిర్యాదు చేయలేదు వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేశారు. నేను కేవలం కేసీఆర్ కి మాత్రమే జవాబుదారీ. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎవరు నాపై ఫిర్యాదు చేయడానికి. గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయానికి ధన్యవాదాలు.

– ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్