హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ నుంచి వెలువడిన ఈ ప్రకటనలో శాశ్వత ఆహ్వానితులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మరియు ప్రత్యేక ఆహ్వానితుల పేర్లను వెల్లడించారు. రాబోయే ఎన్నికలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఈ భారీ కార్యవర్గాన్ని రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ముఖ్యంగా శాశ్వత ఆహ్వానితుల విభాగంలో హేమాహేమీలకు చోటు కల్పించారు. కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ఎంపీలు డాక్టర్ కె. లక్ష్మణ్, డి.కె. అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, ఎం. రఘునందన్ రావు, గోడం నగేశ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలను ఈ జాబితాలో నియమించారు. వీరితో పాటు శాసనసభ పక్ష నేత అలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకట రమణారెడ్డి, రామారావు పటేల్, డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, పైడి రాకేశ్ రెడ్డిలకు ప్రాధాన్యత కల్పించారు. ఎమ్మెల్సీలు ఎ. వెంకట నారాయణ రెడ్డి, మల్కా కోమరయ్య, సి. అంజిరెడ్డిలతో పాటు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కూడా శాశ్వత ఆహ్వానితులుగా ఎంపికయ్యారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వివిధ జిల్లాల నుంచి మొత్తం 116 మందికి అవకాశం కల్పించారు. ఇందులో మంచేరియల్ జిల్లా నుంచి దుర్గం అశోక్, అమరాజుల శ్రీదేవి, నిర్మల్ నుంచి సత్యనారాయణ గౌడ్, కునింటి అంజూ కుమార్ రెడ్డి, రవి పాండే, లక్ష్మీపూర్ నారాయణ రెడ్డిలు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి భరత్ రెడ్డి, డాక్టర్ అలేటి మల్లికార్జున్ రెడ్డి, కంచెట్టి గంగాధర్, గద్దె శ్రీనివాస్, మేడపాటి ప్రకాష్ రెడ్డిలకు చోటు లభించింది. కామారెడ్డి నుంచి పైడి ఎల్లారెడ్డి, గార్గే శ్రీనివాస్, డాక్టర్ మర్రి రాంరెడ్డి, జగిత్యాల నుంచి పుదారి అరుణ, డాక్టర్ యాచమనేని అనూప్ రావు, చన్నమనేని సత్యారావు ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లా నుంచి చుండ్రుపట్ల సునీల్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బల్మూరి వనిత, మనోహర్ రెడ్డిలకు కార్యవర్గంలో స్థానం కల్పించారు. సంగారెడ్డి నుంచి ఎం. నరేందర్ రెడ్డి, రాజేశ్వర రావు దేశ్ పాండే, సిద్దిపేట నుంచి కనకయ్య, చింత సంతోష్ కుమార్, ఎస్. విద్యాసాగర్, అంబటి బాలేష్ గౌడ్ లు నియమితులయ్యారు. రంగారెడ్డి అర్బన్ నుంచి శ్రీదేవి రెడ్డి, బండారు శైలజ, సాయి కిరణ్, సురభి రవీందర్ రావు, కె. ఆంథోనీ రెడ్డిలు సభ్యులుగా చేరారు. నల్గొండ జిల్లా నుంచి మడగాని శ్రీనివాస్ గౌడ్, పి. శ్యామ్ సుందర్, నూకల నర్సింహారెడ్డి, దూడల భిక్షం గౌడ్, సూర్యాపేట నుంచి బొబ్బ భాగ్య రెడ్డి, కడియం రామచంద్రయ్య, బండారు కవితా రెడ్డి, రంగరాజు రుక్మారావులకు అవకాశం దక్కింది. వరంగల్, హన్మకొండ జిల్లాల నుంచి రావు పద్మ, చదా స్వాతి, సిద్ధం నరేష్, జలగం రంజిత్ రావు, ఖమ్మం నుంచి గల్లా సత్యనారాయణ, డాక్టర్ జి. వెంకటేశ్వర్లు, రుద్ర ప్రదీప్ వంటి కీలక నేతలు జాబితాలో నిలిచారు.
ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో 62 మంది సీనియర్ నేతలను చేర్చి వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని పార్టీ నిర్ణయించింది. మాజీ గవర్నర్లు సి.హెచ్. విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. మాజీ మంత్రులు మెచినేని కిషన్ రావు, అమర్ సింగ్ తిలావత్, డాక్టర్ జి. విజయరామారావు, డి. సత్యనారాయణ, సుద్దాల దేవయ్య, మర్రి శశిధర్ రెడ్డి, సి. కృష్ణ యాదవ్, నెరళ్ల ఆంజనేయులు, ఎనుగుల పెద్దిరెడ్డిలకు ఇందులో స్థానం దక్కింది. మాజీ ఎంపీలు చదా సురేష్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, బి.బి. పాటిల్, పోతుగంటి రాములు, వెంకటేష్ నేత బోర్లకుంట, సీతారాం నాయక్ లను కూడా ఈ జాబితాలో చేర్చారు. మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, రావుల రవీంద్రనాథ్ రెడ్డి, నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, జలగం వెంకట్ రావు, గువ్వల బాలరాజు వంటి నేతలకు ఆహ్వానం అందింది. విశేషంగా సినీ రంగం నుంచి నటులు శివకృష్ణ, జీవితా రాజశేఖర్, నటి కవిత, పసునూరి శ్రీనివాస్, లక్ష్మీకాంత్ రావులను కూడా ఆహ్వానితులుగా పార్టీ గుర్తించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు పేరిట ఈ నియామక పత్రాలు జారీ అయ్యాయి.








