హైదరాబాద్, మహా : కేసీఆర్ గొప్పగా పరిపాలిస్తే ప్రజలు ఎందుకు ఓడించారని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని ఆయన అప్పుల పాల్జేశారని విమర్శించారు. సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేసిన నేపథ్యంలో జూపల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ చేసిన అప్పులపై శాసనసభలో లెక్కలతో సహా రుజువు చేశామన్నారు. రాష్ట్ర ప్రజల జేబులకు చిల్లు పెట్టింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో తీసుకున్న అప్పు ఎవరు కడతారని జూపల్లి ప్రశ్నించారు. ఇదే అంశాన్ని శాసనసభలో అడిగితే ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పలేదన్నారు.
Post Views: 11







