నల్లగొండ, మహా
మంత్రులు ఆకస్మిక తనిఖీలతో ఆశ్చర్యపరిచారు. నల్గొండ మండలం కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, రోడ్లు, భవనాలు ,సినిమాగోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవద్దని, తూకం విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు తక్షణమే చెల్లింపులు చేస్తుండడం పట్ల మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ భేష్ అని మంత్రుల కితాబు ఇచ్చారు
Post Views: 23