Mahaa Daily Exclusive

  దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్..

Share

  • పదిమంది మావోయిస్టులు మృతి
  • మృతుల్లో ముగ్గురు మహిళలు..
  • ఆరుగురిని గుర్తించిన పోలీసులు

 

ఛత్తీస్ ఘడ్,మహా : ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగిoది.సుక్మా జిల్లాలోని బెజ్జి అటవీప్రాంతంలో భద్రతా బలగాలకు,మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న క్రమంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.ఉదయం నుంచే జరిగిన కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ఛత్తీస్ ఘడ్‌లోని సుక్మా జిల్లాలోని దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది.మృతి చెందినవారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.మృతి చెందిన వారిలో… దూది మాసా(డివిసీఎం),మాద్వి లక్మా,డోరోకోసి(ఏసిఎంలు),కుంజమ్ బమన్,కాటంకోసి(పీ ఎల్ జి ఏ-8 కమాండర్),దూది హంగీ లను గుర్తించారు.మరో నలుగురిని గుర్తించాల్సి ఉందని…ఘటనా స్థలంలో ఏకే 47-1,ఎస్ ఎల్ ఆర్-1,ఇన్సాస్-1,సింగిల్ షాట్ గన్,1మరియు ఒక పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్ ఘడ్ పోలీసులు తెలిపారు.