Mahaa Daily Exclusive

  ఆపదలో అండగా పరామర్శలు.. ఆర్థిక సాయాలు.. ఆదిలాబాద్ లో కంది మౌన శ్రీనివాస‌రెడ్డి..

Share

ఆదిలాబాద్, మహా

 

ఆదిలాబాద్ ప్రజల సేవలో నిరంతరం నిమగ్నమవుతూ ఆపదలో అండగా నిలుస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి దంపతులు. రాజకీయమైనా, సేవైనా సాటిలేటి మేటిలా ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి తోడుగా ఆయన సతీమణి కంది మౌనా రెడ్డి ప్రజల మధ్యే ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలో పర్యటించి పలువురికి ఆర్ధిక సాయం అందించారు. కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ గ్రామానికి చెందిన పుష్ప లత ఇటివల అనారోగ్యంతో మరణించగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందచేశారు. మత్తడి గూడ గ్రామానికి చెందిన కుమ్ర దినేష్ ఇటివల రైలు ప్రమాదంలో మరణించగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉష్కమల్ల రాములు కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు,కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ రూరల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెట్టి నాగన్న,నాయకులు మామిల్ల భూమయ్య,సార్ల సత్యనారాయణ,బూర్ల శంకరయ్య,సుధాకర్ గౌడ్,దాసరి ఆశన్న,అన్నెల శంకర్ తదితరులు పాల్గొన్నారు.