ఏపీ: ఏపీ సీఎం చంద్రబాబుకు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ రాశారు. అదానీతో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని అందులో ఆమె డిమాండ్ చేశారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె కోరారు. అదానీతో అక్రమ డీల్ కారణంగా రాష్ట్ర ప్రజలపై రూ. లక్షన్నర కోట్ల వరకు భారం పడుతుందని ఆమె పేర్కొన్నారు. అర్ధరాత్రి ఆ ఒప్పందాలు జరిగాయని, వాటికి ఎందుకు అర్ధరాత్రి అనుమతులు ఇచ్చారనేదానిపై దర్యాప్తు చేయాలన్నారు. తక్షణమే ఆ ఒప్పందాలను రద్దు చేయాలని షర్మిల కోరారు. ఆ వెంటనే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు.
Post Views: 23