Mahaa Daily Exclusive

  గోపాలపట్నం బైపాస్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి.. లారీ ఆపకుండా పరారీ..

Share

సీతారామపురం గ్రామానికి చెందిన వీరబాబు, తన శ్రీమతితో కలిసి మోటార్‌సైకిల్‌పై అన్నవరం బ్యాంకుకు వెళ్తుండగా గోపాలపట్నం బైపాస్ బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

వీరబాబు దంపతులు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను టిప్పర్ లారీ ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ లారీ ఆపకుండా అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరబాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న శ్రీమతికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు.

ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీని గుర్తించి, డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Latest