కారేపల్లి,మహ: మహా:ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సింగరేణి ఎంపీడీవో బి.పద్మ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. 9 రకాల సమస్యలపై ప్రజావాణిలో దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. సింగరేణి గ్రామంలోని సుబ్బయ్య కుంట శిఖం భూమిని సర్వే చేయించాలని, గాదెపాడులో డ్రైనేజీ సమస్య, బస్సు సౌకర్యం కల్పించాలని దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలిస్తాం, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణి కి 17 శాఖల అధికారులు హాజరవుతారని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
Post Views: 88







