- విషయం తెలిసినా.. కస్టమర్లకు అంటగట్టిన ఫైనాన్స్ సంస్థల మేనేజర్లు
- లక్షల్లో నష్టపోతున్న సామాన్యులు
- ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజర్ మోసం.. వినియోగదారులకు 13లక్షల నష్టం
- పోలీసు విచారణలో.. అనేక కీలక అంశాలు
- భద్రాద్రి జిల్లాలో బంగారం దందా
మణుగూరు, మహా
మీ గోల్డ్ తాకట్టుపెట్టుకుంటాం.. మీ ఆర్ధిక అవసరాలు తీరుస్తాం అంటూ ప్రచారం చేసుకునే గోల్డ్ ఫైనాన్స్ సంస్థలనే బురిడీ కొట్టించారు ఇద్దరు ఘరానా కేటుగాళ్ళు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్లో ఇండల్ మనీ మణుగూరు బ్రాంచ్ వారు తమ బ్రాంచ్లో వంశీకృష్ణ మరియు పూజారి శ్రీను అనే ఇద్దరు వ్యక్తులు నకిలీ బంగారు గాజులు పెట్టి లోన్లు తీసుకున్నారని ఫిర్యాదు చేయగా దీనిపై మణుగూరు పోలీసుల దర్యాప్తులో అనేక షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మణుగూరులో ఇద్దరు వ్యక్తులు మరికొంతమంది వారి స్నేహితుల ద్వారా ప్రవేటు బ్యాంకుల్లో , గోల్డ్ ఫైనాన్స్ సంస్థల్లో చాలా చోట్ల ఇదేవిధంగా నకిలీ బంగారపు గాజులు . ఇతర బంగారు ఆభరణాలు పెట్టి లోన్లు తీసుకున్నారు.
అయితే ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న కొందరు గోల్డ్ ఫైనాన్స్ సంస్థల మేనేజర్లు దాచిపెట్టి వారు కూడా ఆ నకిలీ బంగారపు గాజులను, నకిలీ బంగారపు ఆభరణాలను ఆన్ లైన్ లో పెట్టి అమాయకపు కస్టమర్లకు విక్రయిస్తున్నారు. ఇందులో భాగంగా మణుగూరు లో ఉన్న ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనే ఫైనాన్స్ సంస్థ ఇటీవల గోల్డ్ ఆక్షన్ లో ఈ నకిలీ బంగారపు ఆభరణాలను అమాయకపు కష్టమర్లకు 13 లక్షల రూపాయలకు అమ్మినట్టుగా తేలింది. మణుగూరు పరిసర ప్రాంతంలో ఉన్న అన్ని రకాల ప్రైవేటు మరియు గవర్నమెంట్ సంబంధిత బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలకు ఈ సందర్బంగా పోలీసులు విజ్ఞప్తిచేశారు. మీ వద్ద పూజారి శ్రీనివాస్ , వంశి అన్న వ్యక్తులు మీ సంస్థలలో నకిలీ బంగారు గాజులు , ఆభరణాలు లోన్ పెట్టినట్లయితే ఆ ఆభరణాలు చెక్ చేసి వాటికి సంబంధించిన సమాచారం తెలపాలని కోరారు..