- మహా కథనంతో ప్రకంపనలు .. కదిలిన అధికారులు
- ఏ క్షణం లోనైనా చెక్ పోస్ట్ పై దాడులకు అవకాశం ఉందంటున్న అధికారులు
- అప్రమత్తమైన పాల్వంచ చెక్ పోస్ట్ అధికారులు
మహా , భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో : అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన రవాణా తనిఖీ కేంద్రంపై రాష్ట్రస్థాయి అధికారులు నిఘా టీమ్ లను ఏర్పాటుచేసినట్లు తెలిసింది. ఓ వైపు ప్రజావిజయోత్సవాల్లో బిజీగా ఉన్నా.. రవాణా చెక్ పోస్ట్ ల వద్ద సాగుతున్న దందా మంత్రి దృష్టికి రావడంతో స్సందించారు. దీనిపై వివరాలు తెప్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. పైసా వసూల్ పాల్వంచ చెక్ పోస్ట్ పై మహా పత్రిక అందించిన వరుస కథనాల కథనాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన చెక్ పోస్ట్ లు, సరిహద్దు చెక్ పోస్టులకు సంబంధించి నివేదికను అధికారులు సిద్దం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు, పైసా వసూల్ ఆరోపణల్లో పాల్వంచ చెక్ పోస్ట్ -ఎ గ్రేడ్ లో ఉన్నట్లు రాష్ట్ర అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. పాల్వంచ చెక్ పోస్ట్ పై నిఘా వర్గాలు కన్నేశాయన్న ప్రచారం నేపథ్యంలో.. స్థానిక అధికారులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఏ క్షణంలో నైనా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో చెక్ పోస్ట్ లో వసూళ్ళరాయుళ్ళ నుండి పైస్థాయి దాకా అధికారులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. వసూలు చేస్తున్న డబ్బులు ఎప్పటికప్పుడు దాటవేస్తున్నట్లు తెలుస్తుంది. నిత్యం వాహనదారుల నుండి లక్షల్లో వసూలు చేసిన అవినీతి సొమ్మంతా ఎవరెవరికి చేరవేస్తున్నారనే కోణంలో నిఘా వర్గాలు దర్యాప్తు చేపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో ఏ అధికారులకు ఎంత వాటాలు అందుతున్నాయని, అవి ఎవరి ద్వారా చేరవేస్తున్నారనేది ఉన్నతాధికారులు ఆరా తీస్తూ నివేదిక రూపొందిస్తున్నట్లు సమాచారం, . పాల్వంచ చెక్ పోస్ట్ పై రాసిన వరుస కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పలువురు లారీల యాజమానులు, ఆటో డ్రైవర్స్ మహాపత్రిక కథనాలను అభినందిస్తూ అవినీతి అధికారుల భరతం పట్టాలంటూ వివరాలు అందిస్తున్నారు.
……