కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. వన్ నేషన్- వన్ ఎలక్షన్ కాన్సెప్ట్‌ను తెర మీదికి తీసుకొచ్చిన నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలు జరగొచ్చంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది.
ఈ పరిస్థితుల్లో ఇప్పటినుంచే పార్టీని బలోపేతం చేయడంపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఈ క్రమంలో రీజినల్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేశారు. వాళ్లందరితో వైఎస్ జగన్ నేడు భేటీ కానున్నారు. ఈ ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటుకానుంది. రీజినల్ కోఆర్డినేటర్లతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఈ విస్తృత సమావేశానికి హాజరు కానున్నారు.
Post Views: 8