వైకాపా హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అరాచకాలకు కొమ్ముకాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గతంలో అగ్నిమాపక డైరెక్టర్ జనరల్‌గా, సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన ఆయన తన అధికారిక హోదాలను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో తేలింది. ఆ నివేదిక ఆధారంగా అఖిలభారత సర్వీసుల నియమావళిలోని 3 (1) సెక్షన్ ప్రకారం ఈ సస్పెన్షన్ విధించింది. అనుమతి లేకుండా ఆయన విజయవాడ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.
Post Views: 26